రాంగ్‌ రూట్లో వచ్చి కారుని ఢీకొట్టాడు

మర్రిపాలెం బీఆర్టీఎస్‌ రహదారిలో వ్యతిరేక మార్గంలో వేగంగా వచ్చిన ఆటో, ఎదురుగా వస్తున్న కారుని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

Update: 2019-11-29 05:08 GMT
ప్రతీకాత్మక చిత్రం

విశాఖపట్నం: మర్రిపాలెం బీఆర్టీఎస్‌ రహదారిలో వ్యతిరేక మార్గంలో వేగంగా వచ్చిన ఆటో, ఎదురుగా వస్తున్న కారుని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే... శుక్రవారం ఉదయం ఎన్‌ఏడీ నుంచి ఊర్వశి జంక్షన్‌ వైపు ఓ కారు వెళుతోంది. అదే రహదారిలో అపసవ్య మార్గంలో వేగంగా ఆటో ప్రయాణిస్తోంది. ఒక్కసారిగా కుక్క అడ్డంగా రావడంతో ఆటో డ్రైవర్‌ దాన్ని తప్పించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న కారుని బలంగా ఢీకొట్టాడు.

దీంతో ఆటో డ్రైవర్‌కు కాళ్లు విరిగిపోగా, ఆటోలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు వారిని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యంగా రాంగ్‌ రూట్లో వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా స్థానిక ప్రజలు తెలియజేశారు. కారు, ఆటో ముందు భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కంచరపాలెం ట్రాఫిక్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను నమోదు చేశారు. 



Tags:    

Similar News