Nellore: స్కూల్లో క్రికెట్ ఆడుతుండగా ఘర్షణ.. అక్కడికక్కడే కుప్పకూలిన బాలుడు
Nellore: క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన వివాదమే కారణమన్న పోలీసులు
Nellore: స్కూల్లో క్రికెట్ ఆడుతుండగా ఘర్షణ.. అక్కడికక్కడే కుప్పకూలిన బాలుడు
Nellore: నెల్లూరు జిల్లా జాకీర్ హుస్సేన్‌నగర్‌లో దారుణం జరిగింది. ఓ స్కూల్లో క్రికెట్ ఆడుతున్న ఇద్దరు మైనర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫరీద్ అనే బాలుడిపై ఫరహాన్ దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఫరీద్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన వివాదమే కారణమని పోలీసులు తెలిపారు.