Atchannaidu: చంద్రబాబును కావాలనే కేసులో ఇరికించి.. అరెస్ట్ చేశారు
Atchannaidu: ప్రజా నాయకుడిని 10 గంటల పాటు తిప్పి.. ఇబ్బంది పెట్టారు
Atchannaidu: చంద్రబాబును కావాలనే కేసులో ఇరికించి.. అరెస్ట్ చేశారు
Atchannaidu: చంద్రబాబుపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడు అన్నారు. స్కిల్ కేసు లో ఇరికించి చంద్రబాబు నాయుడు గారి తో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సంజసంగా లేదని ఆరోపించారు.ఏపికి ఇది చీకటి రోజు గా భావిస్తున్నామన్నారు. సిఐడి చీఫ్ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలే రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారన్నారు, సిఐడి సీఎం జగన్ చేతిలో కీలు బొమ్మ గా మారిందన్నారు. ఈ కేసు లో చంద్రబాబు కానీ, తాను కానీ ఏ వ్యక్తి కి అయిన లాభం చేకూర్చిమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామన్నారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ సంతకం కావాలన్నారు. దీనిపై గవర్నర్ స్పందిస్తారని ఆశిస్తున్నామని అచ్చంనాయుడు అన్నారు.