Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు ప్రమాణ స్వీకారం

Ashok Gajapathi Raju: ప్రముఖ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు గోవా రాష్ట్ర గవర్నర్‌గా శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Update: 2025-07-26 06:43 GMT

Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు ప్రమాణ స్వీకారం

Ashok Gajapathi Raju: ప్రముఖ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు గోవా రాష్ట్ర గవర్నర్‌గా శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లోని బంగ్లా దర్బార్‌ హాల్‌లో ఆయనను ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, అక్కడి మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్‌, వంగలపూడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు తెదేపా ఎంపీలు, నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అశోక్‌ గజపతిరాజుకు ఇది గవర్నర్‌ హోదాలో తొలిపదవి కావడం విశేషం. ఆయన రాజకీయ అనుభవం, నిర్వాహక పరిపక్వత రాష్ట్రానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News