Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు

Update: 2025-07-14 10:20 GMT

Ashok Gajapathi Raju: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రకారం, గోవా గవర్నర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు.

అదే విధంగా, హరియాణా గవర్నర్‌గా ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ బాధ్యతలు చేపడుతున్నారు. ప్రస్తుతం హరియాణా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగియడంతో ఈ మార్పు జరిగింది.

ఇక లడ్డాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది.

గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు నియమితులవ్వడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆయన నియామకం ఏపీ ప్రజలకు గర్వకారణమన్నారు. అశోక్‌ గజపతిరాజును గవర్నర్‌గా నియమించిన రాష్ట్రపతి, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అశోక్‌గజపతిరాజు విజయవంతంగా పదవీకాలం పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News