నేడు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు

వైయస్సార్ నవశకం సర్వేకు సంబంధించి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నారు.

Update: 2019-12-07 03:36 GMT
మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు

ఆత్మకూరు: వైయస్సార్ నవశకం సర్వేకు సంబంధించి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు తెలిపారు. వైయస్సార్ నవశకం సర్వేలో భాగంగా వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి వెళ్లి ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు.

వాలంటీర్లు వచ్చిన సమయంలో అందుబాటులో లేక ప్రభుత్వ పథకాలకు నమోదు చేసుకొని వారి కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు హెల్ప్ డెస్క్ పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పలకల కు అర్హులైన లబ్ధిదారులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, బ్యాంకు పాస్ పుస్తకం, కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Tags:    

Similar News