ఏపీలో నిన్న ఒక్కరోజే దాదాపు ఏడువేల పరీక్షలు

కోవిడ్-19 పరీక్షల్లో ఆంధ్ర్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. నిన్న(శుక్రవారం) ఒక్కరోజే 6,928 పరీక్షలు చేశారు.

Update: 2020-04-25 10:46 GMT

కోవిడ్-19 పరీక్షల్లో ఆంధ్ర్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. నిన్న(శుక్రవారం) ఒక్కరోజే 6,928 పరీక్షలు చేశారు.. ఈ విషయాన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ట్విట్టర్ లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 61,266 పరీక్షలు చేసిన ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉంది.ఇటీవల దక్షిణ కొరియా నుంచి తెపించిన ర్యాపిడ్ కిట్ ల ద్వారా కూడా పరీక్షలు చేస్తున్నారు. వీటిద్వారానే పరీక్షల సామర్ధ్యం పెరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం వైయస్‌. జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సిబ్బంది పనితీరు, కేసుల పెరుగుదలపై ఆరాతీసినట్టు తెలుస్తోంది.

ఇక గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయన్న సీఎం. ల్యాబులు లేని జిల్లాల్లో ల్యాబులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రలో 13 జిల్లాల్లో 12 ల్యాబ్ లు ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే శనివారం కొత్తగా 61 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కి చేరుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 171 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.. వ్యాధి భారిన పడి 31 మంది చనిపోయారు.


Tags:    

Similar News