గోపవరం ఉపాధిహామీ ఏపీఓతో సహా ముగ్గురిపై సస్పెన్షన్ వేటు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, నిధుల విషయంలో చోటుచేసుకున్న అక్రమాలు సోషల్ ఆడిట్ లో బట్టబయలయ్యాయి.

Update: 2019-12-08 07:02 GMT

గోపవరం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, నిధుల విషయంలో చోటుచేసుకున్న అక్రమాలు సోషల్ ఆడిట్ లో బట్టబయలయ్యాయి. ఈ పథకం కింద మండలంలో 5 కోట్ల మేర వివిధ రకాల పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కాలువపల్లి పంచాయతీలో చేపట్టిన 11 లక్షల పనులకు సంబంధించి సోషల్ ఆడిట్లో అవకతవకలు బయటపడడంతో ఏపీవో నరసింహులుతో పాటు ముగ్గురిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో నాగార్జునుడుకు నివేదికలు అందాయి.

కాలువ పల్లి పంచాయతీలో 2018 ఏప్రిల్ నుండి 2019 మార్చి వరకు ఉపాధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా 11 లక్షల వరకు మస్టర్ లలో దిద్దుబాట్లు , వారం రోజులకు గాను ఒకేరోజు పేర్ల నమోదు తదితర తేడాలు ఉన్నట్లు సోషల్ ఆడిట్లో గుర్తించారు. అధికారులు నివేదికలను డ్వామా పీడీకి అందజేశారు. సంబంధిత అధికారులు కలెక్టర్ హరికిరణ్ కు సమర్పించడంతో వాటి ఆధారంగా ఏపీవో నరసింహులు, ఈసీ శివశంకర్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ సత్యవాణి, ఫీల్డ్ అసిస్టెంట్ ఖాదర్లను సస్పెండ్ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఏపీఓగా వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అలాగే తాత్కాలిక ఈసీగా సుబ్రహ్మణ్యం నియమించినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు.

Tags:    

Similar News