AP Weather Report: వాయుగుండంగా అల్పపీడనం.. ఆ 7 జిల్లాలకు భారీ వర్ష సూచన
AP Weather Report: ఉత్తర కోస్తాకు మరోసారి భారీ వర్షాల ముప్పు తప్పేలా లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ వాయుగుండం కారణంగా విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాబోయే రెండు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు సూచించారు.