ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. ఒక్కరోజే10 కేసులు నమోదు
Omicron Cases in Andhra Pradesh: ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. ఒక్కరోజే10 కేసులు నమోదు
Omicron Cases in Andhra Pradesh: ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు రావడం కలకలం రేపుతోంది. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కి చేరింది. కువైట్, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు రాగా అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు రెండు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు అధికారులు వివరించారు.