ఏపీలో రీపోలింగ్ శాతం ఎంతంటే..

Update: 2019-05-07 01:22 GMT

ఏపీలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అలజడి లేకుండా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేశారు. రీపోలింగ్ లో మొత్తం 81.48 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ఇసుకపాలెంలో 75.55 , సూళ్ళూరు పేట నియోజకవర్గం అటకానితిప్ప 84.23 శాతం ప్రకాశం జిల్లా పరిధిలోని కలనూతల లో 87.01, గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం కేశనపల్లి లో 89.23, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువు లో 75.43, పోలింగ్‌ శాతం నమోదైనట్టు ద్వివేది తెలిపారు.

నేడు(మంగళవారం) కౌంటింగ్ పై రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని ద్వివేది తెలిపారు. అలాగే ఈనెల 17వ తేదిలోగా వారు జిల్లా స్థాయిలో కౌంటింగ్ పై శిక్షణ ఇస్తారన్నారు. కౌంటింగ్ కు ర్యాండమైజేషన్ పద్దతిలో సిబ్బందిని ఎంపిక చేస్తామని తెలిపారు. 

Similar News