నాటుసారాపై పోలీసుల ఉక్కుపాదం.. 72 వేల లీటర్ల నాటుసారా.. 249 మంది అరెస్టు...

Nandyal: అసాంఘిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అణచివేస్తాం - జిల్లా ఎస్పీ

Update: 2022-04-24 06:16 GMT

నాటుసారాపై పోలీసుల ఉక్కుపాదం.. 72 వేల లీటర్ల నాటుసారా.. 249 మంది అరెస్టు...

Nandyal: నంద్యాల జిల్లా పరిధిలో నాటుసారా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే గ్రామ బహిష్కరణ, జిల్లా బహిష్కరణ తప్పదంటూ పోలీసులు హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాలతో నాటుసారా పై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అణచివేస్తామన్నారు జిల్లా ఎస్పీ. నంద్యాల జిల్లాలో గడచిన ఇరవై రోజుల్లో 72 వేల లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు పోలీసులు.

నాటుసారా తయారు చేస్తున్న 249 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నాటుసారా తయారీ, అక్రమ రవాణా, సరఫరాకు పాల్పడుతున్న 230 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లకు యువత ఆకర్షితులు కావద్దని, కాదని పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News