AP Panchayati Elections: ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
ఏపీలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు
ఏపీలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పంచాయతీ ఎన్నికలు తొలి దశలో విజయనగరం మినహా మిగతా 12 జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక 12 జిల్లాల్లోని 2వేల723 పంచాయతీలు, 20వేల 157 వార్డు స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో జరిగిన పోలింగ్.. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక చేపట్టనున్నారు. తొలి దశలో పోలింగ్‌లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.