Nadendla Manohar: కొత్త‌ రేష‌న్ కార్డు అప్లై చేసుకునే వారికి గుడ్ న్యూస్‌.. ఆ స‌ర్టిఫికేట్ అవ‌స‌రం లేదు..!

Nadendla Manohar: ఏపీ ప్రజలకు రేషన్‌కార్డు విషయంలో ఓ ముఖ్యమైన సమాచారం. రేషన్‌కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Update: 2025-05-22 09:25 GMT

Nadendla Manohar: కొత్త‌ రేష‌న్ కార్డు అప్లై చేసుకునే వారికి గుడ్ న్యూస్‌.. ఆ స‌ర్టిఫికేట్ అవ‌స‌రం లేదు..!

Nadendla Manohar: ఏపీ ప్రజలకు రేషన్‌కార్డు విషయంలో ఓ ముఖ్యమైన సమాచారం. రేషన్‌కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) తెలిపారు. దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.

విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్, పెళ్లికార్డు, పెళ్లి ఫొటో అవసరం లేదని స్పష్టంచేశారు. కొన్ని చోట్ల జరుగుతున్న తప్పుడు ప్రచారంపై స్పందించిన ఆయన, "ఈ విషయమై క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయవద్దు. రేషన్‌కార్డుకు ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలి. ఏమైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి" అని సూచించారు.

ప్రభుత్వం 4.24 కోట్ల మందికి జూన్‌లో ఉచితంగా రేషన్‌కార్డులు జారీ చేయనుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారుల దగ్గర సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగిస్తూ స్మార్ట్‌ రైస్‌కార్డులను క్యూఆర్‌ కోడ్‌తో అందించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.

వయసుతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులను రేషన్‌కార్డులో యాడ్‌ చేసుకోవచ్చని, మరణించిన వారి పేర్లనే తొలగించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ‘హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ’ మార్పు చేసుకునే అవకాశమూ కల్పిస్తున్నామని వెల్లడించారు. తప్పుడు వివరాల సవరణ కోసం జాయింట్ కలెక్టర్ వద్దకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించేలా అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

Tags:    

Similar News