కేంద్ర జలశక్తి మంత్రితో మంత్రులు బుగ్గన, అనిల్‌ భేటీ

Update: 2020-12-11 09:12 GMT

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్‌ యాదవ్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాల వ్యవహారంపై మంత్రితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మంత్రి అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ...పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై కేంద్రమంత్రితో చర్చించాం. 2017లో జరిగిన పొరపాట్ల వల్ల పోలవరానికి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కేంద్ర మంత్రికి వివరించాం. వాటిపై అవగాహన ఉందని, ప్రాజెక్టు ముందుకెళ్లేలా చూస్తామన్నారు. ప్రాజెక్టులో తాగునీటి విభాగాలను తొలగించారు. అవికూడా ఉంచాలని కోరాం. విభజన చట్టంలో పోలవరంపై తాగునీటి అవసరాల అంశం కూడా ఉంది. పరిహారం, పునరావాసంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని కేంద్రమంత్రిని కోరాం. 15 రోజులలోపే పోలవరం వస్తానని చెప్పారు. అనుకున్న సమయానికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం అని మంత్రి అనిల్‌ వివరించారు.

Tags:    

Similar News