నారావారిపల్లె ప్రజలకు చంద్రబాబు ఎంటో తెలుసు అందుకే కుప్పం పంపారు

Update: 2020-02-02 13:49 GMT

మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో వైసీపీ ప్రజాసదస్సు బహిరంగ సభ నిర్వహించింది. అభివృద్ధి , పాలన వికేంద్రీకరణ లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని వైసీపీ నేతలు చెప్పారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల అభివృధ్దికి సీఎం జగన్ శ్రీకారం చూట్టారని చెప్పారు. ప్రజలు అధికార వికేంద్రీకరణ జరుగాలని కోరుకుంటున్నారని వైసీపీ నేతలు చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం చంద్రబాబు రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమ అభివృద్ది జరుగుతుందన్నారు.

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వలనే రాయలసీమకు గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రాయలసీమను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే ఆలోచనతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. అధికార వికేంద్రీకరణ జరగాలని నారావారిపల్లెకు చెందిన ప్రజలు కూడా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. నారావారిపల్లె ప్రజలకు చంద్రబాబుగురించి తెలుసు అందుకే చంద్రబాబును ఓడించి కుప్పానికి పంపించారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. 
 

అంతకు ముందు చంద్రగిరి నియోజక వర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు స్వగ్రామంలో సభ ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహాం వద్ద నిరసన తెలిపారు. పోలీసులకు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ సభ ఉండడంతో ఆందోళల విరమించాలని పోలీసులు కోరారు. 

Tags:    

Similar News