జవాన్ ఉమా మహేశ్వరరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
Uma Maheswara Rao: దేశ రక్షణలో భాగంగా జమ్ముకశ్మీర్‌లో వీర మరణం పొందిన శ్రీకాకుళం వాసి లావేటి ఉమామహేశ్వరరావు కుటుంబానికి 50 లక్షల ఆర్థికసాయం అందించారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.
జవాన్ ఉమా మహేశ్వరరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
Uma Maheswara Rao: దేశ రక్షణలో భాగంగా జమ్ముకశ్మీర్‌లో వీర మరణం పొందిన శ్రీకాకుళం వాసి లావేటి ఉమామహేశ్వరరావు కుటుంబానికి 50 లక్షల ఆర్థికసాయం అందించారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. ఉమామహేశ్వరరావు భార్య నిరోషాకు చెక్‌ను ఇచ్చారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణ దాస్ మాట్లడూతూ ఆర్మీ జవాన్ ఉమా మహేశ్వరరావు మృతి తీరని లోటుని అన్నారు.
ఆయన ప్రాణాలను ఫణంగా పెట్టి దెశాన్ని కాపాడారాని ప్రతి ఒక్కరూ వారి త్యాగాలను గుర్తుచేసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. దేశానికి జవాన్, రైతు వెన్నెముకని అన్న ఆయన బాధిత కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం జగన్, డిప్యూటీ సీఎం ధర్మానకు కృతజ్ఞతలు తెలియజేశారు ఉమామహేశ్వరరావు భార్య నిరోషా.