మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana: నేను నిన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్నా..హైదరాబాద్‌లో కరెంట్ లేక జనరేటర్ వాడాల్సి వచ్చింది.. ఇది నేనెవరితోనూ చెప్పలేదు
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ గురించి కేటీఆర్‌కు ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడేమోనని తాను నిన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉన్నానన్న ఆయన హైదరాబాద్‌లో కరెంట్ లేక జనరేటర్ వాడాల్సి వచ్చిందని ఇది నేనెవరితోనూ చెప్పలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. కేటీఆర్ ఏపీకి వస్తే రహదారులు ఎలా ఉన్నాయో చూపిస్తానన్నారు.