బూస్టర్ డోస్‌, పిల్లల వ్యాక్సినేషన్‌పై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు

జవనరి 10 నుంచి హైల్త్‌ వర్కర్స్, ప్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌ డోసు

Update: 2021-12-30 02:04 GMT

 బూస్టర్ డోస్‌, పిల్లల వ్యాక్సినేషన్‌పై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు

Andhra Pradesh: బూస్టర్ డోస్‌, పిల్లల వ్యాక్సినేషన్‌పై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రెండు డోసులు వేసుకున్న వారికి బూస్టర్‌ డోస్‌, 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ఏపీ వైద్యఆరోగ్యశాఖ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. చిన్నపిల్లల వ్యాక్సినేషన్‌ కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ షురు కానుంది. ఇక జవనరి 10 నుంచి హైల్త్‌ వర్కర్స్, ప్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌ డోసు ఇవ్వనున్నారు. రెండో డోసు తీసుకొని 9 నెలలు పూర్తైన వారికి మాత్రమే బూస్టర్ డోసు వేయనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి సైతం బూస్టర్ డోసు వేసే అవకాశముంది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.  

Tags:    

Similar News