AP Local Body Elections: ఏపీలో మూడు నెలల ముందే స్తానిక సంస్థల ఎన్నికలు

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది.

Update: 2025-09-04 05:52 GMT

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందుగా 2026 జనవరిలో నిర్వహించేందుకు చట్టంలో వెసులుబాట్లు మేరకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.

ఇందు కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహానీ పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల కమిషనర్లకు లేఖలు రాషారు. ప్రస్తుత సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ లో.. నగరపాలక, పురపాకల సంస్థలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవి కాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఆలోగానే జనవరిలో ఎన్నికల నిర్వహాణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని ఈసీ లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News