AP in Grip of Sanitiser Deaths: మందుబాబులే లక్ష్యంగా రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తో తయారీ

AP in Grip of Sanitiser Deaths: ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే... మరోవైపు శానిటైజర్‌ మరణాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ శానిటైజర్‌ మరణాలతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2020-08-06 08:28 GMT

AP in Grip of Sanitiser Deaths: ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే... మరోవైపు శానిటైజర్‌ మరణాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ శానిటైజర్‌ మరణాలతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మరణాలకు శానిటైజరా? మరేదైనా కారణం ఉందా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నా వేళ అధిక లాభాల ఆశపోతు రాబంధుల ఉరవడి నిశ్చేష్టపరుస్తోంది.

మద్యం దొరకటం లేదు. మరి మత్తు ఎక్కాలంటే ఏదో ఒకటి చేయాలి. ఆ ఆలోచనే వారిని మృత్యువై కబళించింది. శానిటైజర్ తాగుతూ చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి రక్షించుకొనేందుకు ఉపయోగిస్తున్న శానిటైజర్ కొంత మంది మత్తుకు ఉపయోగిస్తున్నారు. మత్తుకు బానిసైన కొంతమంది దీనిని నీళ్లలో కలుపుకుని తాగి ప్రాణాలు వదులుతున్నారు. ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ మోగించిన మరణ మృదంగం అందరిని కలిచివేసింది. కరోనా వేళ పలు కంపెనీలు రకరకాల పేర్లతో శానిటైజర్లను విచ్చల విడిగా మార్కెట్ వదిలాయి. అందులో కొందరు ఒక బ్రాండ్‌ను ఎంచుకొని తాగి ప్రాణాలు వదిలారు.

శానిటైజర్ల మరణాల వెనక పెద్ద తలకాయల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుసుస్తోంది. హైదరాబాద్ లోని బాలానగర్ ప్రాంతంలో ఏపికి చెందిన ఓ సంస్ద రెక్టిఫైడ్ స్పిరిట్ తో తాయారు చేసి శానిటైజ్‌లు విక్రయిస్తోందని విచారణలో తేలింది. మరోవైపు గుంటూరు జిల్లాలో ఓ పార్మాసూటికల్స్ ద్వారా శానిటైజర్ తయారు చేసి విక్రయిస్తున్నారని విచారణలో తేల్చారు. మృతులు ఎక్కువ మంది ఈ సంస్ద తయారు చేస్తున్న శానిటైజర్లు తాగి మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ శానిటైజర్‌ తయారీ కంపెనీ వెనక గుంటూరు జిల్లాకు చెందిన ఓ రాష్ట్ర సంఘం నాయకుడు ఉన్నాడని ఆయన ఇటీవల తెలివిగా తప్పించుకున్నట్లు సమాచారం. నరసారావుపేట ప్రాంతానికి చెందిన ఆయన ఏజెన్సీస్ ,ఎంటర్ ప్రేజెస్, ల్యాబొరేటరీస్ వంటి వేర్వేరు పేర్లతో వ్యాపారాలు నడుపుతున్నాడన గుర్తించారు.

ఈ ప్రమాద ఘటనలపై ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మృతులు త్రాగిన శానిటైజర్లలో కార్నినోజిక్ అనే కేన్సర్ ఆనవాళ్లను ఉన్నట్లు అనుమానిస్తున్నారు. శానిటైజర్లు త్రాగిన కొద్దిసేపటికే లివర్ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఈ శానిటైజ్‌ మరణాల వెనక ఉన్న మఫియా ముఠా ముఖాలను గుర్తించి పనిలో పడ్డారు.

Tags:    

Similar News