తప్పుడు కేసులపై ఏపీ శాసనమండలిలో వాడివేడి చర్చ

రాజకీయ కక్షపూరిత కేసులపై ఏపీ శాసనమండలిలో వాడి-వేడి చర్చ జరిగింది.

Update: 2025-09-23 07:24 GMT

రాజకీయ కక్షపూరిత కేసులపై ఏపీ శాసనమండలిలో వాడి-వేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో హోంమంత్రి అనిత, బొత్స మధ్య మాటలయుద్ధం జరిగింది. కేసులపై మాట్లాడుతుంటే వైసీపీ సభ్యులు ఉలిక్కి పడుతున్నారని హోంమంత్రి అనిత అన్నారు. గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తమపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆమె గుర్తుచేశారు. తమపై గొడ్డలి వేటు, తల్లిచెల్లి పెట్టిన కేసులు లేవని హోంమంత్రి అనిత అన్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. అనవసర విషయాలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అనిత వ్యాఖ్యలను నిరసిస్తూ మండలి నుంచి వాకౌట్‌ చేస్తున్నామన్నారు బొత్స.

Tags:    

Similar News