రాజమండ్రి జైల్లో ఎయిడ్స్ రోగుల వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Update: 2019-08-01 07:16 GMT

రాజమండ్రి జైల్లో ఎయిడ్స్ రోగుల వ్యవహారంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిడ్స్ రోగులకు కల్పిస్తున్న వైద్య సేవల వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఆదేశించింది. జైల్లో మొత్తం 15 వందల మంది ఖైదీలు ఉండగా 27 మంది ఎయిడ్స్ తో బాధపడుతున్నట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే వీరికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదికను తమకు అందజేయాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ కోరారు. జైలులో ఇంత పెద్ద స్ధాయిలో ఎయిడ్స్ రోగులు ఎలా ఉన్నారని ప్రశ్నించిన ఆయన జైలుకు వచ్చాక ఎవరికైనా ఎయిడ్స్ సోకి ఉంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ప్రభుత్వ న్యాయవాది ఎయిడ్స్ రోగులను గుర్తించి ఇతర ఖైదీలతో కలవకుండా వేరుగా ఉంచుతామన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి పనులు చట్టరిత్యా నేరమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

Full View  

Tags:    

Similar News