Cyclone Ditwah: దిత్వా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్
Cyclone Ditwah: దిత్వా తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
Cyclone Ditwah: దిత్వా తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి అనిత. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. శిథిలావస్థ స్థితిలోని ఇళ్లలో ఉండేవారిని గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రలో రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.