Ravvalakonda: రవ్వలకొండను తవ్వుతున్న మైనింగ్ మాఫియా

Ravvalakonda: నిత్యం వందలాది లారీల్లో కోట్లు విలువచేసే ఖనిజ సంపద తరలింపు...

Update: 2022-03-24 07:06 GMT

Ravvalakonda: రవ్వలకొండను తవ్వుతున్న మైనింగ్ మాఫియా

Ravvalakonda: కాలజ్ఞానం రాసిన పోతూలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస ప్రాంతంపై మైనింగ్ మాఫియా కన్నుపడింది. రవ్వలకొండను పిండికొట్టేస్తున్నారు. చరిత్రకు సజీవసాక్ష్యంగా నిలిచి..సహజ సంపదకు నిలయంగా ఉన్న రవ్వలకొండ అక్రమార్కుల కాసుల కక్కుర్తితో నామరూపాలు లేకుండా చేస్తున్నారు. రాత్రి..పగలు తేడా లేకుండా నిర్విరామంగా కొండను తవ్వి మైనింగ్ తవ్వకాలు సాగిస్తున్నారు. నిత్యం వందలాది లారీల్లో కోట్లు విలువ చేసే ఖనిజ సంపద యదేచ్చగా తరలిపోతుంది.

మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్నా ప్రభుత్వం.. అధికారులు అటువైపు చూడటం లేదు. కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లే కాదు.. సహజ సంపదకు నిలయం.. అపారమైన సహజ సంపద జిల్లాలో ఉంది. అదే ఇప్పుడు అక్రమార్కుల జేబులు నింపుతోంది. బనగానపల్లి సమీపంలోని రవ్వలకొండ.. 450 ఏళ్ల క్రితం భవిష్య వాణిని ప్రపంచానికి తెలియచేసిన పోతులూరి వీరభ్రహ్మేంద్రస్వామికి ఆనవాళ్లుగా ఉన్న చరిత్ర కల్గిన ఈ కొండను మైనింగ్ పేరుతో మాయం చేస్తున్నారు.

గ్రానైట్ పేరుతో సాగుతున్న మైనింగ్ ఆపాలంటూ స్థానికులు.. విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. రవ్వలకొండపై అక్రమమైనింగ్, మాఫియా ఆగడాలు అడ్డుకోవాలంటూ ఏపీ సీఎస్ కు లేఖ కూడా రాశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అక్రమై మైనింగ్ తవ్వకాలు నిలిపివేసే వరకు పోరాడుతామంటున్నారు జిల్లాకు చెందిన విశ్వబ్రాహ్మ వర్గాలు.

అక్రమ మైనింగ్ నిరసిస్తూ విశ్వ బ్రాహ్మణులు, విశ్వకర్మలు పౌరోహిత్య సంఘాలు పోరాటం చేస్తున్నాయి...చలో రవ్వలకొండ వంటి ఆందోళన కార్యక్రమాలతో కదం తొక్కుతున్నాయి... మరో వైపు బీజేపీ నేతలు సైతం రవ్వల కొండ పరిరక్షణ కోసం పోరాటం చేసేందుకు సిద్ధం అవుతోంది...మారి అధికారులు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో అన్నది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Tags:    

Similar News