AP Governor orders on nimmagadda issue: నిమ్మగడ్డ కేసులో ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ సంచలన ఆదేశాలు!

AP Governor orders on nimmagadda issue: నిమ్మగడ్డ రమేష్ కేసులో గవర్నర్ వద్ద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది.

Update: 2020-07-22 06:56 GMT
Nimmagadda Ramesh with AP Governor Bishwabhushan (file image)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టడానికి లైన్ క్లియర్ అయింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తిపై రాజ్‌భవన్‌ స్పందించింది. రమేష్ కుమార్ విజ్ఞప్తిని పరిశీలించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆయనను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాగా సోమావారం గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వకపోవడంతో.. తన స్థానాన్ని పునరుద్ధరించాల్సిందిగా నిమ్మగడ్డ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.

కాగా ఎన్నికల కమిషనర్ పదవి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని సూచనలు చేసింది. అందులో భాగంగా గవర్నర్‌ను రమేశ్ కుమార్‌ కలిశారు. కాగా కరోనా వ్యాప్తికంటే ముందు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా ప్రభలుతుందేమో అని ఎన్నికలు వాయిదా వేశారు నిమ్మగడ్డ. అయితే ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్కార్.. ఆయనను తొలగించడానికి ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే ఈ ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.   

Tags:    

Similar News