Anganwadi: అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం
Anganwadi: జులైలో అంగన్వాడీల జీతాలు పెంచుతామని ప్రభుత్వం ప్రకటన
Anganwadi: అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం
Anganwadi: ఏపీలో అంగన్వాడీలు సమ్మె విరమించారు. అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు. 42 రోజుల సమ్మెకు తెరదించుతూ.. నేటి నుంచి తిరిగి విధుల్లోకి చేరనున్నారు. ప్రభుత్వం ముందు అంగన్వాడీలు 11 డిమాండ్లు పెట్టారని.. 10 డిమాండ్లను ఒప్పుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మిగిలిన ఒక్క డిమాండ్‌ను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. సమ్మె కాలానికి జీతాలు ఇచ్చి.. కేసులు ఎత్తివేస్తామన్నారు.
జులైలో అంగన్వాడీల జీతాలు పెంచుతామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. ఈ ఏడాది నుంచే అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపజేస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు మంత్రి బొత్స.
తమ సమస్యలపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు ఏపీ అంగన్వాడీల ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ. ఇవాళ్టి నుంచి విధులకు హాజరువుతున్నట్లు ఆమె తెలిపారు. జీతాల పెంపుపై ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. అంగన్వాడీలకు వైఎస్‌ఆర్ బీమా ఇస్తామని చెప్పినట్లు సుబ్బరావమ్మ తెలిపారు. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతామని మంత్రి బొత్స చెప్పినట్లు సుబ్బరావమ్మ తెలిపారు.