రేషన్ కార్డుకి కొత్త అర్హతలు: ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆహార భద్రతా నియమాల్లో ఏపీ ప్రభుత్వం సవరణలు చేసింది. రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2019-12-03 06:41 GMT

నెల్లూరు: ఆహార భద్రతా నియమాల్లో ఏపీ ప్రభుత్వం సవరణలు చేసింది. రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాలు, పట్టణాల్లో వార్షికాదాయం, ఇతర నిబంధనల్లో మార్పులు చేసింది. నాలుగు చక్రాల వాహనాలున్న వారిని బీపీఎల్ కోటా నుంచి మినహాయించారు. ఐతే క్యాబ్‌లు నడుపుకునే వారికి కూడా ఇది వర్తిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.

గ్రామాల్లో వార్షికాదాయం రూ.లక్షా 20 వేలు లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. పట్టణాల్లో వార్షికాదాయం రూ.లక్షా 44 వేలకు లోపు ఉన్న వారు అర్హులు. నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారిని, బీపీఎల్ (దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారు) కోటా నుంచి మినహాయింపు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులను, బీపీఎల్ కోటా కింద పరిగణించేలా ఉత్తర్వులు జారీ. 

Tags:    

Similar News