ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాజెక్టులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలో రివర్స్ టెండరింగ్ కు వెళుతోంది. అయితే ఇందుకోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో మొత్తం 29 అంశాలను నిర్ధేశించింది. అందులో ముఖ్యంగా ఈ-టెండరింగ్‌లో పాల్గొనే సంస్థ ఏపీలో రిజిస్టర్ కావాలన్న నిబంధనను ప్రభుత్వం తీసేసింది. ఒకవేళ బిడ్డర్ రాకపోతే పనుల్ని చిన్న చిన్న ప్యాకేజీలుగా విడదీసి ఈ-టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించింది. అయితే ఈ కాంట్రాక్టు ఒప్పందాలపై న్యాయ సమీక్ష జరిగిన తర్వాతే రివర్స్ టెండరింగ్ నిర్వహించనుంది. ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టులో 3వేలకోట్ల రూపాయలు మేర తేడాలు ఉన్నట్టు నిపుణుల కమిటీ నిర్ధారించిన సంగతి తెలిసిందే.