Andhra Pradesh: ఏప్రిల్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై ఏపీ సర్కార్ ఫోకస్

Andhra Pradesh: ఎన్నికల కోడ్ ముగియడంతో అభివృద్ధి పనులపై దృష్టి సారించారు ఏపీ సీఎం జగన్‌.

Update: 2021-03-16 12:17 GMT

ఏప్రిల్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై ఏపీ సర్కార్ ఫోకస్

Andhra Pradesh: ఎన్నికల కోడ్ ముగియడంతో అభివృద్ధి పనులపై దృష్టి సారించారు ఏపీ సీఎం జగన్‌. ఎన్నికలతో నిలిచిపోయిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన సీఎం జగన్, ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 16న రైతులకు, ఏప్రిల్ 20న డ్వాక్రా సంఘాలకు వై‍ఎస్సార్ సున్నావడ్డీ డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు.

ఇక ఏప్రిల్ 27న జగనన్న వసతి దీవెన, ఏప్రిల్ 13న వాలంటీర్లను సత్కరించే కార్యక్రమాల్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. ప్రతీరోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎస్పీ, కలెక్టర్ వెళ్లాలని సూచించారు. వాలంటీర్లను సేవారత్న, సేవామిత్ర, సేవా వజ్ర పేర్లతో సత్కరించాలని తెలిపారు. 

Tags:    

Similar News