AP Endowment Minister ON Ganesh Chaturthi: చవితి నిబంధనలపై ఎలాంటి దురుద్ధేశాలు లేవు: దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

AP Endowment Minister ON Ganesh Chaturthi : ప్రజల ప్రాణాలే ముఖ్యమనే ఉద్దేశం తో ప్రభుత్వం వినాయక చవితి పండుగను ప్రజలు ఇళ్లలోనే చేసుకోవాలని సూచించిందని, దీనిపై ఎటువంటి దురుద్ధేశాలు లేవని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Update: 2020-08-21 06:06 GMT

టీటీడీ 

AP Endowment Minister ON Ganesh Chaturthi: ప్రజల ప్రాణాలే ముఖ్యమనే ఉద్దేశం తో ప్రభుత్వం వినాయక చవితి పండుగను ప్రజలు ఇళ్లలోనే చేసుకోవాలని సూచించిందని, దీనిపై ఎటువంటి దురుద్ధేశాలు లేవని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం ఆయన స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం నాదనీరాజన వేదిక మీద నిర్వహిస్తున్న సుందర కాండ పారాయణంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆలయం ఎదుట తనను కలిసిన మీడియాప్రతినిధులతో మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష , దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్ల కరోనా నుంచి ప్రజలు త్వరలోనే విముక్తి చెందుతారని ఆశాభావం వ్యక్తం టీటీడీ ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుందరకాండ పారాయణం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు విరాట పర్వ పారాయణం నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని మంత్రి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించడానికి టీటీడీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు టీటీడీ కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు అమలు చేస్తూ సంతృప్తికర దర్శనం కల్పిస్తోందని చెప్పారు. ఆలయాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో కార్యక్రమాలు చేయాలని ఆదేశించినట్లు మంత్రి వివరించారు

Tags:    

Similar News