ఛలో విజయవాడతో ఏపీలో హైటెన్షన్ వాతావరణం.. ఉద్యోగులకు సెలవులను రద్దు చేసిన సర్కార్..
Chalo Vijayawada: చలో విజయవాడ నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఛలో విజయవాడతో ఏపీలో హైటెన్షన్ వాతావరణం.. ఉద్యోగులకు సెలవులను రద్దు చేసిన సర్కార్..
Chalo Vijayawada: చలో విజయవాడ నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చలో విజయవాడలో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు భారీ సంఖ్యలో విజయవాడకు తరలివచ్చారు. మరోవైపు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సభకు ఎలాంటి అనుమతి లేదని విజయవాడ సీపీ క్రాంతిరాణా స్పష్టం చేశారు.
సభ పెట్టుకునేందుకు అనుమతి కోరిన BRTS రోడ్డును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. BRTS రోడ్డులో 100కు పైగా కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే BRTS రోడ్డుకు వెళ్లే అన్ని మార్గాల్లో మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు అత్యవసరమయితే తప్ప ఏ ఉద్యోగికి సెలవు ఇవ్వొద్దని అన్ని జిల్లాల అధికారులకు, జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు.