Narayana Swamy: ప్రజాసంక్షేమం కోసమే సీఎం నిర్ణయాలు
Narayana Swamy: అందుకే మూడు రాజధానులను తీసుకొచ్చారు
Narayana Swamy: ప్రజాసంక్షేమం కోసమే సీఎం నిర్ణయాలు
Narayana Swamy: నిత్యం ప్రజాసేవకే అంకితమై సేవచేస్తున్న సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసమేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలనే ఆలోచనతోనే మూడు రాజధానులు తీసుకొచ్చారన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనేదే సీఎం ప్రధాన లక్ష్యమని చెప్పారు.
రాయలసీమ ప్రజల మదిలో ఏముందో ఇప్పుడయినా ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలుసుకోవాలని సూచించారు. చంద్రబాబుకి తోడు నీడగా ఉండే పవన్ కళ్యాణ్‌కి మూడు రాజధానుల అవసరం తెలియాలన్నారు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి కష్టాలు పడుతున్నామని, మళ్లీ అదే పరిస్థితి రాకుండా చూడాలనే మూడు రాజధానులు సీఎం తీసుకొచ్చారన్నారు. నవరత్నాలు, మూడు రాజధానులను వక్రీకరిస్తున్న చంద్రబాబు కనువిప్పు కావాలని వేంకటేశ్వరుడిని ప్రార్ధించానని తెలిపారు.