నిధుల సేకరణ కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. రాజధాని భూముల అమ్మకానికి సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్

AP CRDA: నిధుల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-06-25 16:15 GMT

నిధుల సేకరణ కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. రాజధాని భూముల అమ్మకానికి సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్

AP CRDA: నిధుల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని భూముల విక్రయానికి CRDA ప్రణాళిక తొలి విడతలో భాగంగా 248.34 ఎకరాలను విక్రయించేందుకు నిర్ణయించారు. ఎకరాకు 10 కోట్ల చొప్పున 2,480 కోట్ల రూపాయల్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ 389 జీవోను ప్రభుత్వం జారీ చేసింది.

గతంలో బీఆర్ షెట్టీ మెడిసిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజికి ఇచ్చిన 148 ఎకరాలను విక్రయించేందుకు CRDA సిద్ధమైంది. పురపాలక శాఖపై ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో సొంతంగా నిధులను సమీకరించాలని నిర్ణయించారు. తదుపరి ఏడాదికి 50 ఎకరాల చొప్పున 600 ఎకరాల విక్రయానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. 

Tags:    

Similar News