AP Coronavirus Latest Updates: ఏపీలో ఒక్కరోజే 10 వేలకు పైగా కరోనా కేసులు

Update: 2020-07-29 12:41 GMT
corona

AP Coronavirus Cases Updates: ఏపీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. టెస్టులు పెంచే కొద్ది.. కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 10 వేల పైచిలుకు కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 20 వేలకు దగ్గరగా ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 70,984 శాంపిల్స్ ను పరీక్షించగా 10,093 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అలాగే గడిచిన 24 గంటల్లో 2,784 మంది కోవిడ్‌ నుండి కోలుకొని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఈ డిశ్చార్జ్ లు కేవలం కోవిడ్ కేర్ సెంటర్లలోని మాత్రమే. మరోవైపు కరోనా కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో పద్నాలుగు మంది, అనంతపూర్‌ జిల్లాలో ఎనిమిది మంది, విజయనగరం జిల్లాలో ఏడుగురు, చిత్తూర్‌ జిల్లాలో ఆరుగురు,

కర్నూల్‌ జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు రోగులు మరణించారు. ఇక రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,17,495 పాజిటివ్ కేసులలో ఇప్పటివరకూ 52,529 మంది డిశ్చార్జ్ అయ్యారు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 1,213 మంది మరణించారు.. ప్రస్తుతం వివిధ కోవిడ్ కేర్ సెంటర్లలో 63,753 మంది చికిత్స పొందుతున్నారు. కాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధిక కరోనా పరీక్షలు చేశారు. 




 


Tags:    

Similar News