ఇవాళ నెల్లూరుకు సీఎం జగన్.. జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభం

Update: 2021-01-11 00:28 GMT

 సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టు రెండో విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరుకు బయలుదేరుతారు. 11.10 గంటలకు నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11.40కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ సందర్శిస్తారు. అనంతరం బహిరంగ ఏర్పాటు చేసిన సభ వేదిక వద్దకు చేరుకొని అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనతరం తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి బయలుదేరుతారు.

అయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో జగనన్న అమ్మఒడి పథకం అమలుపై సందేహం నెలకొంది. జగనన్న అమ్మఒడి పథకానికి ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన కూడా చేశారు. పంచాయతీ ఎన్నికలకు కోడ్ వర్తించదన్నారు ఆదిమూలపు సురేష్ స్ఫష్టం చేశారు. సీఎం ప్రకటించిన విధంగానే 11న నెల్లూరు పట్టణంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇప్పటికే జీవో నెంబర్ 3 విడుదల చేశాం. 44,08,921 మందికి అమ్మ ఒడి వర్తిస్తుంది. రూ.6,612 కోట్లతో అమ్మ ఒడి అమలు చేసి తీరతాం స్ఫష్టం చేశారు. రాష్ట్రంలో జగన్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవటమే ముఖ్య ఉద్దేశంగా ఎన్నికల కమిషనర్ ప్రవర్తిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు విద్యార్ధులకు విద్యా సంవత్సరం వృధా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా పాఠశాలలను పున: ప్రారంభం చేస్తున్నామని తెలిపారు.


Similar News