CM Jagan Letter to Central Govt: ఆమె పదవీకాలం పొడిగించండి : కేంద్రానికి సీఎం జగన్ లేఖ

CM Jagan Letter to Central Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాశారు.

Update: 2020-07-29 15:30 GMT
CM Jagan Letter to Central Govt

CM Jagan Letter to Central Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాశారు. వాస్తవానికి నీలం సాహ్ని పదవీకాలం జూన్ 30 నాటికి ముగిసింది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో నీలం సాహ్ని పదవీకాలాన్ని ఆరునెలలు పొడిగించాలని కోరుతూ రెండు నెలల కిందట ముఖ్యమంత్రి లేఖ రాశారు.. దాంతో కేంద్ర ప్రభుత్వం నీలం సాహ్ని పదవీకాలాన్ని మూడు నెలలు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దాని ప్రకారం సెప్టెంబర్ 30 తో నీలం సాహ్ని పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమె పదవీకాలం పొడిగించాలని కోరుతూ మరోసారి సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు.

కాగా నీలం సాహ్ని 1984 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. నల్గొండ జాయింట్ కలెక్టర్ ఆ తరువాత మచిలీపట్టణం అసిస్టెంట్ కలెక్టర్ గా నీలం సాహ్ని పనిచేశారు. అంతేకాదు శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా , మున్సిపల్ పరిపాలనా విభాగం డిప్యూటీ సెక్రెటరీగా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం నీలం సాహ్నిని ఏపీకి కేటాయించారు. దాంతో సీనియర్ కావడంతో 2019 నవంబర్ 13న ఏపీ సీఎస్ గా నీలం సాహ్నిని ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసుకుంది.  

Tags:    

Similar News