ఏపీలో ఎమ్మెల్యేలకు నిధుల వరద.. 175 సీట్లు గెలుపే లక్ష్యంగా జగన్ అడుగులు..
Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీలో ఎమ్మెల్యేలకు నిధుల వరద.. 175 సీట్లు గెలుపే లక్ష్యంగా జగన్ అడుగులు..
Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే బాధ్యతాయుతంగా నియోజకవర్గాల్లో పనిచేయాలని సూచనలు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రెండు కోట్లరూపాయలను అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నిధులు ఇస్తామని సీఎం తెలిపారు. సచివాలయం విజిట్ పూర్తయిన వెంటనే కలెక్టర్లు నిధులిస్తారని సీఎం ప్రకటించారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించి సచివాలయాలకు ఏం కావాలో ప్రజాప్రతినిధులతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటే అభివృద్ధి పనులకు నిధులు వెచ్చిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చురుగ్గా పనిచేస్తే 175 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం పెద్ద కష్టమేమీకాదని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తంచేశారు.