చల్లా భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి.. కుటుంబానికి అండగా ఉంటానని హామీ..
AP CM Jagan: తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్ను మూసిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి భౌతిక కాయానికి సీఎం జగన్ ఘన నివాళులర్పించారు.
చల్లా భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి.. కుటుంబానికి అండగా ఉంటానని హామీ..
AP CM Jagan: తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్ను మూసిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి భౌతిక కాయానికి సీఎం జగన్ ఘన నివాళులర్పించారు. అనంతరం చల్లా భార్య శ్రీలక్ష్మి, కుమారులను, కుటుంబీకులను పరామర్శించారు. ఏడాది క్రితం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన తన తండ్రి లాంటి చల్లా రామకృష్ణా రెడ్డిని కోల్పోయానని, ఇప్పుడు పార్టీ అభివృద్ధి కోసం ఎంతో తపన పడే సోదరుడి లాంటి చల్లా భగీరథరెడ్డి మరణం తనను ఎంతో కలచివేసిందని సీఎం తెలిపారు. తాను ఒక కుటుంబ సభ్యుడిలా చల్లా కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.