Atmakur Bypoll: మేకపాటి విక్రమ్ రెడ్డికి బీ ఫారం అందజేసిన సీఎం జగన్
Atmakur Bypoll: వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Atmakur Bypoll: మేకపాటి విక్రమ్ రెడ్డికి బీ ఫారం అందజేసిన సీఎం జగన్
Atmakur Bypoll: వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో ఉప ఎన్నిక అనివార్యమైంది. గౌతమ్ రెడ్డి వారసుడిగా విక్రమ్ రెడ్డిని కుటుంబసభ్యులు బలపర్చగా సీఎం జగన్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కాగా ఇవాళ అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మేకపాటి విక్రమ్ రెడ్డి కలిశారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా మేకపాటి విక్రమ్ రెడ్డి బీ ఫారం అందుకున్నారు. ఉప ఎన్నికల్లో ఈ సారి ఎక్కువ మెజార్టీని సాధించాలని విక్రమ్ రెడ్డికి జగన్ సూచించినట్టు సమచారం.