మూడు రాజధానులపై సీఎం జగన్‌ కీలక ప్రకటన.. త్వరలోనే..

AP Assembly: సీఆర్డీఏ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లు ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్టు సీఎం జగన్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

Update: 2021-11-22 10:11 GMT

మూడు రాజధానులపై సీఎం జగన్‌ కీలక ప్రకటన.. త్వరలోనే..

AP Assembly: సీఆర్డీఏ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లు ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్టు సీఎం జగన్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం అంటే తనకు వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని అన్నారు. అయితే ఇక్కడ కనీస వసతులు లేవని చెప్పారు. కనీస వసతులకు ఎకరాకు రూ.2 కోట్లు అవుతాయిని సీఎం జగన్‌ తెలిపారు.

వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు ఉన్నట్టు ప్రతిపక్షాలు చిత్రీకరించాయన్నారు. అందరికీ న్యాయం అన్న సదుద్దేశం పక్కన బెట్టి కొందరికి అన్యాయం అనే వాదన తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడటం కోసం వికేంద్రీకరణ నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్టు జగన్ స్పష్టం చేశారు. వికేంద్రీకరణ అవసరాన్ని ప్రజలకు వివరిస్తామని, అన్ని వర్గాల ప్రజలను మెప్పించేలా మరోసారి 3 రాజధానులపై మరింత సమగ్రమైన బిల్లు తీసుకొస్తామని చెప్పారు సీఎం జగన్.

Tags:    

Similar News