CM Chandrababu: ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.
CM Chandrababu: ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరులో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరు చేరుకోనున్నారు. ఏటుకూరు బైపాస్ హెలిప్యాడ్ దగ్గర పార్టీ నేతలను చంద్రబాబు కలువనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రపంచ తెలుగు మాహాసభల ప్రాంగణం చేరుకుంటారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ బస చేసిన ఐటీసీ వెల్ కం హోటల్ కు చంద్రబాబు వెళ్లనున్నారు. కాసేపు ధరంబీర్ గోకుల్ తో మాట్లాడనున్నారు.