Chandrababu: జిల్లా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలి
Chandrababu: కూటమి ప్రభుత్వ పాలనలో సంస్కరణలు సత్ఫలితాలు సాధించేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధచూపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Chandrababu: కూటమి ప్రభుత్వ పాలనలో సంస్కరణలు సత్ఫలితాలు సాధించేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధచూపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో కీలకాంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే పన్నులపై దృష్టిసారించాలన్నారు. మున్సిపాల్టీ ప్రాంతాల్లో భూ క్రమబద్ధీకరణ, భవన క్రమబద్ధీకరణ పథకాల లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలని సూచించారు.
రెవెన్యూ శాఖలో భూ సమగ్ర సర్వేచేసి రికార్డుల్ని ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. తిరుపతి ఎర్రచందనం డిపోలో సీసీకెమరాలతో నిఘాను పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు. డిపోలో ఏళ్ల తరబడి ఉన్నఎర్రచందనం నిల్వలు వస్తూత్పత్తులు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.