Free Bus: ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్
CM Chandra babu: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
Free Bus: ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్
CM Chandra babu: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఎస్‌ఆర్టీసీ, రవాణాశాఖలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పరిశీలించి నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోందని..అక్కడ అమలు చేస్తున్నా తీరు, అందులో లోటుపాట్లను పరిశీలించాలన్నారు. కొంత ఆలస్యమైనా.. ఇందులో ఎటువంటి లోపాలకూ తావులేకుండా, మహిళలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.