Chandrababu: అమరావతిలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu at Amaravati: అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.
Chandrababu: అమరావతిలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu at Amaravati: అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నీరు మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని ఆయన పర్యటించారు. మట్టి సేకరించిన గుట్టకు సాష్టాంగ నమస్కారం చేశారు చంద్రబాబు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని సందర్శించారు. ఇక నాడు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అమరావతి రైతులు, మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన భవనాల సముదాయాలను పరిశీలించారు సీఎం.