టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దూకుడు.. వల్లభనేని వంశీకి పీటీ వారెంట్ జారీ

Vallabhaneni Vamsi: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దూకుడు పెంచింది.

Update: 2025-02-24 07:26 GMT

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దూకుడు.. వల్లభనేని వంశీకి పీటీ వారెంట్ జారీ

Vallabhaneni Vamsi: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే సత్యవర్ధన్‌ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అవగా.. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులోనూ ఆయన్ను విచారించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా వంశీకి పీటీ వారెంట్ జారీ చేసింది సీఐడీ. ఈ కేసులో వంశీని విచారించాలని భావిస్తున్న సీఐడీ అధికారులు.. కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు.

మరోవైపు ఇప్పటికే సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతోంది సీఐడీ. పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కూడా ఇవాళే తీర్పు వెలువరించనుండగా.. కోర్టు అనుమతి ఇస్తే రెండు కేసుల్లోనూ విడివిడిగా వంశీని విచారించేందుకు సిద్ధమవుతున్నారు సీఐడీ అధికారులు. 

Tags:    

Similar News