సీఎం జగన్‌ను కలిసిన జీఎన్‌ రావు కమిటీ

Update: 2019-11-29 03:18 GMT

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం జీఎన్‌ రావు కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వారు క్షేత్రస్థాయి పర్యటనలు, జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలను బుధవారంతో ముగించుకున్నారు. ప్రస్తుతం తుది నివేదిక తయారు చేస్తున్నారు. ఈ కమిటీ సభ్యులు గురువారం ముఖ్యమంత్రి జగన్‌ను కలుసుకున్నారు.

కమిటీకి నేతృత్వం వహిస్తున్న జీఎన్‌ రావు, కార్యదర్శి విజయమోహన్‌, సభ్యులైన డాక్టర్‌ అంజలి మోహన్‌, డాక్టర్‌ మహావీర్‌, ప్రొఫెసర్‌ కె.టి.రవీంద్రన్‌, డాక్టర్‌ సుబ్బారావు, అరుణాచలం ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తాము సందర్శించిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను కమిటీ సభ్యులు సీఎంకు నివేదించారు. త్వరలోనే తాము అధ్యయనం చేసిన అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌కు నివేదిక సమర్పిస్తామని వారు స్పష్టం చేశారు.

Tags:    

Similar News