AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. రూ. 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదించే ఛాన్స్

AP Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనున్నది.

Update: 2025-10-10 05:59 GMT

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. రూ. 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదించే ఛాన్స్

AP Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనున్నది. లక్షా 14 వేల 824 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతిలో 21 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. 87 వేల 520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలుపనుంది. అమరావతిలో 212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్‌భవన్ నిర్మాణానికి ఆమోదం తెలుపనుంది.

మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం లభించనుంది. రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు ఆమోదం తెలపనుంది. అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది.. హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదించే అవకాశం ఉంది.. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెల‌పనుంది కేబినెట్.. ఉద్యోగుల డీఏకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది.. ఇక, ప‌లు సంస్థల‌కు భూ కేటాయింపుల‌కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

Tags:    

Similar News