Somu Veerraju: సీఎం జగన్ కు ఏపీ బీజేపీ చీఫ‌‌ సోమువీర్రాజు బహిరంగ లేఖ

Somu Veerraju: జగన్ గతంలో ఇచ్చిన హామి వీడియో ట్యాగ్ చేసిన సోము

Update: 2022-04-14 02:15 GMT

Somu Veerraju: సీఎం జగన్ కు ఏపీ బీజేపీ చీఫ‌‌ సోమువీర్రాజు బహిరంగ లేఖ

Somu Veerraju: ఉత్తరాంద్ర నీటి ప్రాజెక్టులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీల వీడియోను ట్యాగ్ చేసిన ఆయన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం రూట్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. చుక్క నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన ప్రభుత్వం అసమర్థత వల్ల సిరులు పండాల్సిన మాగాణులు ఎడారిలా మారుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ‎45వేల కోట్లతో ఈ ప్రాజెక్టులు నిర్మిస్తే 19 టీఎంసీలు అందుబాటులోకి వచ్చే ఛాన్సుందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యం అంటున్న జగన్ ఉత్తరాంధ్రపై ఎందుకింత వివక్షచూపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News