ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధం

Update: 2019-09-18 11:47 GMT

ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధం విధించింది. ఆరోగ్య రంగంలో సిఫార్సులపై సుజాతా రావు కమిటీ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. వందకు పై సిఫార్సులు చేస్తూ కమిటీ నివేదిక సమర్పించింది. ఆరోగ్యశ్రీ సేవల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆసుపత్రుల్లో నవంబర్ ఒకటి నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింప చేయనున్నారు. రెండు వేల వ్యాదులను ఆరోగ్యశ్రీలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్టుగా జనవరి ఒకటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేయనున్నారు. అదే విధంగా వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేయనున్నట్లు ప్రకటించారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి కోలుకునేంత వరకు విశ్రాంతి సమంయలో నెలకు ఐదు వేల చొప్పున సహాయం అందించాలని నిర్ణయించారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒకే కేటగిరి కిందకు తీసుకు వచ్చి నెలకు ఐదు వేలు ఇచ్చే విధంగా మార్గ దర్శకాలు తయారు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News